RR vs KKR: నేడు గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు సంసిటీగా రాణించడంతో రాజస్థాన్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి ప్రారంభం ఇచ్చినప్పటికీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు.
Read Also: TCL Tv: క్రికెట్ అభిమానులకు సువర్ణ అవకాశం.. టీవీ కొనండి మ్యాచ్ టికెట్స్ గెలుచుకోండి!
ఇక రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29 పరుగులు, 24 బంతుల్లో) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రియన్ పరాగ్ 25 పరుగులు (15 బంతుల్లో, 3 సిక్సర్లు) వేగంగా ఆడినప్పటికీ, ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత సంజు శాంసన్ (13 పరుగులు), నితీశ్ రానా (8 పరుగులు) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. అలా వికెట్లు పడుతున్న మరోవైపు ధ్రువ్ జురెల్ 33 పరుగులు (28 బంతుల్లో, 5 ఫోర్లు) జట్టును నిలబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్ద భాగస్వామ్యం అందించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన షుభం దూబే (9 పరుగులు), షిమ్రాన్ హెట్‌మైర్ (7 పరుగులు) కూడా మిడిలార్డర్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. ఇన్నింగ్స్ చివర్లో జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు ( 7 బంతుల్లో, 2 సిక్సర్లు) ఆడినా పెద్ద స్కోరు అందుకోలేకపోయింది. ఇక కోల్‌కతా బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల అద్భుత ప్రదర్శన చేసారు. వరుణ్ చక్రవర్తి, మోయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రానాలు చెరో 2 వికెట్లు తీశారు. స్పెన్సర్ జాన్సన్ ఒక వికెట్ తీసాడు.