Rajasthan Polling: రాజస్థాన్ నేడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. 68 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Also Read: Rahul Gandhi: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది.. అయితే ఈ ఒక్క గ్రామంలో మాత్రం ఒక్క ఓటు…
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, పీఎం మోడీని టార్గెట్ చేశారు. భారత్ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తన తండ్రి రాజీవ్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ పేరును తప్పుగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వెంటనే కాంగ్రెస్ నాయకుడిపై విరుచుకుపడడంతో పాటు ఎగతాళి చేసింది.
Rajasthan Assembly Polls: రాజస్థాన్‌లో ఓటు వేయడానికి కేవలం 10 రోజుల ముందు కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ మరణించారు. ఆయనకు 75 ఏళ్లు. కూన్ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడవు ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల్ని పాత కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది.
Yogi Adityanath: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్‌బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లా దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. రాబోయే రాజస్థాన్ ఎన్నికల కోసం సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌లో జీవిత భాగస్వామి వివరాలను కోరుతున్న కాలమ్‌లో కాంగ్రెస్ నాయకుడు "విడాకులు తీసుకున్నాను" అని పేర్కొన్నందున ఇది వెలుగులోకి వచ్చింది.
India TV-CNX Opinion Poll: 5 రాష్ట్రాల ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరబోతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి రావచ్చని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ కేవలం 72 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇక…
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
Rajasthan: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నవంబర్ 30తో ముగించి, డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఎన్నికలపై ఉంది.