PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
ఈ ఏడాది రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ జరగనున్నాయి. ప్రధాన పార్టీ ఇప్పటినుంచే ఎన్నికలపై దృష్టి సారించాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎం-3 ఈవీఎంలతో జరగనున్నాయి.