Religious Propaganda : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మత ప్రచారం చేస్తూ పట్టుబడ్డాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బైబిల్లు పంచిపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ నాయకులు సదరు ప్రభుత్వ ఉద్యోగి బండారాన్ని బయటపెట్టారు. ఈ మేరకు బీజేపీ నేతలు సదరు ఉపాధ్యాయుడిపై ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు..…
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటిస్తున్నారు. వేముల వాడకు చేరుకున్న సీఎంకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్ఞాపికను అందించారు. రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం స్వామి వారికి కోడే మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామికి మొక్కులు చెల్లించి పూజలో పాల్గొన్నారు. నంది దర్శనం చేసుకున్నారు. రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర…
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి…
మైక్రో ఫైనాన్స్ అధికారులు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఫైనాన్స్ చెల్లించాలని 8 గంటలుగా ఫైనాన్స్ సిబ్బంది మహిళ ఇంట్లో కూర్చున్నారు. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంగరాజు కట్టుకథ వీడింది. ఘనుడు గంగరాజు పోలీస్ లానే బురిడీ కొట్టించాడు. కిడ్నాప్ డ్రామాగా పోలీసులు తేల్చారు. భూమి సమస్యలతో తన బాబాయ్ కుటుంబ సభ్యులను ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
మారుతున్న సమాజానికి అనుగుణంగా రోజు రోజుకూ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో పాటు.. స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. కంపెనీలను బట్టి స్మార్ట్ వాచ్ లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో లభిస్తున్నాయి.
CFN Pabbala Anil: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.