Rajanna Sircilla Crime: భార్యను చంపి.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య..?
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..
- భార్యను చంపి భర్త ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లో దూస రాజేశం (54) అనే వ్యక్తి భార్య లక్ష్మి (50)తో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, పెద్ద కొడుకు వేణు, మౌనిక వివాహం కాగా.. చిన్న కొడుకు వెంకటేష్ బిటెక్ చదువుతున్నాడు. అయితే రాజేశంకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇక ఇక్కడి నుంచి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. సంతోషంగా వున్న వీరి జీవతంలో కుటుంబ కలహాలు నరకయాతనకు గురిచేశారు. గత ఆరు నెలల నుండి ఉపాధి లేకపోవడంతో తరుచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏందో విషయంలో భార్య భర్తలిద్దరూ గొడవ పడేవారు.
Read also: Cast Reservation : బీహార్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ?
Also Read
భార్య సూటి పోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. భార్య లక్ష్మి బెడ్ రూం లో ఉండగా.. లోనికి వెళ్లాడు.. ఆమెను బెడ్ రూంలో బలమైన ఆయుధంతో మొహం పై కొట్టి చంపాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భార్యను చంపి రాజేశం కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాదం నెలకుంది. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్న ఇంట్లో ఎవరు లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా.. చిన్న కొడుకు వేణు మా అమ్మను చంపి నాన్న ఉరివేసుకొని చనిపోయాడని పోలీసులకు తెలిపారు. అయితే ఇంట్లో భార్యభర్తలిద్దరూ గొడవ జరుగుతున్నప్పుడు చిన్న కొడుకు వేణు ఉన్నట్లు తెలిపారు. ఇంకా ఆధారాలకోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
Srisailam Dam: పర్యటకులకు అలర్ట్.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత..
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!