Sonam Raghuvanshi Case: దేశవ్యాప్యంగా సంచలనంగా మారిన హనీమూన్ మర్డర్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 23న మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని, అతడి భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. సోనమ్ తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది.
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో బిట్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో లేని కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసి, హత్య కోసం కిరాయి హంతకులను నియమించుకున్నారు. మేఘాలయ హనీమూన్‌కి వెళ్లిన సమయంలో భార్య సోనమ్ దగ్గర ఉండీ తన భర్త రాజాను హత్య…
UP: రాజా రఘువంశీ, సోనమ్ వ్యవహారం దేశాన్ని కలవరానికి గురిచేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న యువకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఈ ఘటన చేసింది. హనీమూన్ పేరుతో తన భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్, అక్కడే అతడిని దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఉండేందుకు, కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. రాజాను చంపేందుకు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
ఇండోర్‌కు సంబంధించిన కొత్త జంట రాజా రఘువంశీ-సోనమ్ మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23న జంట అదృశ్యమైంది. అయితే రాజా తల్లి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండేది.
భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది.
రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వివాహం జరిగిందని.. ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందని రాజా సోదరుడు సచిన్ తెలిపారు. పెళ్లికి ముందు కూడా సోనమ్ కుటుంబంతో కలిసే షాపింగ్ చేసినట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత రాజా శవమై కనిపించగా.. తాజాగా అతడి భార్య పోలీసులకు చిక్కింది. భార్యనే కిరాయి ముఠాతో భర్తను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మేఘాలయ ముఖ్యమంత్రి, డీజీపీ కూడా స్పష్టం చేశారు.
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్‌కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు.