UP: రాజా రఘువంశీ, సోనమ్ వ్యవహారం దేశాన్ని కలవరానికి గురిచేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న యువకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఈ ఘటన చేసింది. హనీమూన్ పేరుతో తన భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్, అక్కడే అతడిని దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఉండేందుకు, కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. రాజాను చంపేందుకు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ బదౌన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య లవర్ తో కలిసి పారిపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే అతడి భార్య, ప్రియుడితో కలిసి లేచిపోయింది. భర్త ఆమెను వెతకడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా.. ‘‘నేను మరొక రాజా రఘువంశీగా మారకుండా తప్పించుకున్నాను’’ అని సంతోషపడుతున్నారు. తన ప్రియుడితో కలిసి జీవించాలనే భార్య నిర్ణయాన్ని అంగీకరించారు.
Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..
ఖుష్బూకు మే 17న సునీల్‌ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అత్తామామల ఇంటికి వెళ్లింది. 9 రోజుల తర్వాత వివాహ సంప్రదాయాల్లో భాగంగా పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత, తన ప్రియుడితో అక్కడి నుంచి పారిపోయింది. సునీల్ తన భార్య కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నప్పుడు, ఖుష్బూ సోమవారం పోలీస్ స్టేషన్‌లో కనిపించి తన ప్రేమికుడితో పారిపోయినట్లు ఒప్పుకుంది. సునీల్ తన భార్య నిర్ణయాన్ని అంగీకరించాడు.
‘‘ఆమెను మా హనీమూన్ కోసం నైనిటాల్‌కు తీసుకెళ్లాలని నేను ప్లాన్ చేసాను. కానీ ఆమె తన ప్రేమికుడితో ఉండాలనుకుంటే, నేను కూడా సంతోషంగా ఉన్నాను. మరో రాజా రఘువంశీగా మారకుండా నేను తప్పించుకున్నాను! ఇప్పుడు మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాము. నా జీవితం నాశనం కాకుండా తప్పించుకున్నాను’’ అని సునీల్ చెప్పారు. వివాహ సమయంలో ఖుష్బూ కు ఇచ్చిన నగలు, ఇతర వస్తువులను ఆమె ఇంటి వారు తిరిగి ఇచ్చారు. పరస్పర ఒప్పందం తర్వాత, వధువు తన ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి హరేంద్ర సింగ్ చెప్పారు. ఒప్పందం అధికారికంగా నమోదు చేయడంతో, తదుపరి చట్టపరమైన సమస్యలు లేకుండా ఈ విషయం మూసివేయబడింది.