తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించిన రైతు సంఘర్షణలో సభలో తాము ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోమని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ విషయంపై వరంగల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ స్పందించారు. అసలు కాలం చెల్లిన కాంగ్రెస్‌తో ఎవరు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటారంటూ ఛలోక్తులు పేల్చారు. దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు ఎవరూ లేదరని, అసలు ఆ పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అంటూ సెటైర్ వేశారు.…
కొన్ని రోజుల నుంచి తెలంగాణలో రాజకీయం అగ్గి రాజుకుంటోంది. తమ ఉనికి చాటేందుకు రాజకీయ పార్టీలు పాదయాత్రలు, సభలంటూ వరుసగా నిర్వహిస్తూ.. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలకి తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో పర్యటించిన కేటీఆర్.. మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అసలు కేసీఆర్ లేకపోతే.. టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిదని ప్రశ్నించారు. విమర్శలు చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా…
నిన్న అట్టహాసంగా వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ మంత్రలు వరుస పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీగారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం…
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా సెటైర్స్ వేశారు. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. అంతేకాదు, ఆ డైలాగ్‌కి తగ్గ ఉన్న మేనరిజం ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే, ఆ వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ వేశారు. ‘‘కేటీఆర్ గారు.. మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్…
వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల స్పప్నమన్నారు. కానీ, తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు. మీ అందరి కల నెరవేర్చడానికి అనేకమంది రక్తం చిందించారని, కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని, సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ ఘడ్‌లో రైతులు రుణమాఫీ…
ఈరోజు తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలిమెట్టు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్…