Heavy Rains: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పలు చోట్ల పట్టాలు మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీని వల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదర్, సియోన్ ప్రాంతాలతో పాటు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా పొవై సరస్సు పొంగిపొర్లుతోంది. మంగళవారం భారీ వర్షాల మధ్య ముంబైలోని ఘట్కోపర్‌లోని పంచశీల్ నగర్‌లో కొండచరియలు విరిగిపడి ఇల్లు నేలమట్టమైంది.
ముంబయిలో దాదాపు 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం వరకు ముంబయి సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే శివారు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి.
Also Read
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
మహారాష్ట్రలోని పలు నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది హెచ్చరిక స్థాయిని దాటిందని, అంబా, సావిత్రి, పాతాళగంగ, ఉల్హాస్, గర్హి నదుల నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే స్వల్పంగా దిగువన ఉంది. అలాగే మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, పూణే, బీడ్, లాతూర్, జాల్నా, పర్భానీ తదితర ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రత్నగిరి, రాయగఢ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం అధికారులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు జగబూడి, కాజ్లీ నదుల నీరు హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్నందున జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ..: ఆ రాష్ట్రంలో కూడా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌లోని కులూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతిలో ఆరుగురు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. వరదల కారణంగా జిల్లాలోని మలానా, మణికరణ్ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లాలోని ధల్లీ టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతిచెందారు. అటు బిహార్‌లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!