Amarnath Yatra: పునః ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra: మంచు శివలింగం దర్శనం కోసం భక్తులు చేపట్టే అమర్‌నాథ్ యాత్ర పునః ప్రారంభమైంది. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఎడతెగని వర్షాల కారణంగా గత మూడు రోజుల నుంచి నిలిచిపోయిన అమర్‌నాథ్‌యాత్ర.. ఆదివారం పంజతరణి, శేష్‌నాగ్ శిబిరాల నుంచి ప్రారంభమైంది. అమర్‌నాథ్ గుహ దగ్గర వాతావరణం మెరుగుపడటంతో మందిర ద్వారాలను తెరిచి.. అక్కడ చిక్కుకుపోయిన భక్తులకు మంచు శివలింగాన్ని దర్శించే అవకాశం అధికారులు కల్పించారు. ఇప్పటికే దర్శనం చేసుకున్న భక్తులకు బల్టాల్ బేస్‌క్యాంప్‌నకు వెళ్లడానికి అనుమతించారు. అనంతనాగ్‌లోని కాజీగుండ్ శిబిరంలో 700 మందికిపైగా యాత్రికులకు సైన్యం ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వీరి యాత్ర నిలిచిపోయింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో కొత్తగా యాత్రికులను జమ్మూ నుంచి అనుమతించడంలేదు.
Read alsoL Swarnalatha Bhavishyavani: గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరెచ్చిపోయారు..!
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్ పడిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. జమ్ము కశ్మీర్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల అధికారులు యాత్రకు రావడం శ్రేయస్కరం కాదని చెప్పి.. మూడు రోజుల క్రితం జాతీయ రహదారులపై రాకపోకలను నిషిధించారు. ప్రస్తుతానికి పహాల్గామ్ మార్గంలో మాత్రమే రాకపోకలు మొదలయ్యాయి. బల్తాల్లో వర్షాలు కురుస్తున్నందున అక్కడ ఇంకా ప్రారంభించలేదు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 6 రోజుల పాటే భక్తుల దర్శనాలు జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 67,566 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. రక్షణ దళ సిబ్బంది కొండ చరియలు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి 62 రోజుల వార్షిక తీర్థయాత్ర జూలై 1న అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ , గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం డ్రోన్లు, మెటల్ డిటెక్టర్లు, ఇతర నిఘా పరికరాలు, ఆధునిక ఆయుధాలతో కూడిన సిబ్బందిని హైవేపై మరియు వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..