Rain in Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా, అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్ నగర్, యూసఫ్ గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది. Hyderabad ORR Tragedy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..…
Rain In Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది.
Weather Updates: తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశముందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,…
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నగరంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లై ఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు. ‘రక్షాబంధన్’ సందర్భంగా మధ్యాహ్నం తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్న అనేక కుటుంబాలు వర్షంలో చిక్కుకుని మెట్రో ఫ్లైఓవర్ కింద వేచి ఉండాల్సి వచ్చింది. అరగంట తర్వాత వర్షం తగ్గిన తర్వాతే ముందుకు సాగారు. సికింద్రాబాద్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. షేక్‌పేట వద్ద సెంట్రల్ మీడియన్‌కు ఇరువైపులా వర్షం నీరు చేరడంతో…
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడుతోంది. దీంతో ముసురు ఆగని పరిస్థితి.. వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు..
Weather Warnings: ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. m. ఎత్తులో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి తక్కువ స్థాయి గాలులు వీస్తున్నాయి.