Weather Warnings: ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే ప్రభావం ఉంది. కానీ.. దీని ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Mahesh Babu-Hardik Pandya: ఏంట్రా.. ఇంత అందంగా ఉన్నాడు! మహేష్ బాబుని చూసి షాక్ అయిన హార్దిక్
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశగా వీచే అవకాశం ఉంది. గంటకు 8-12 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు. గాలి తేమ 77 శాతంగా నమోదైంది.
Liquoe Parties: దావత్‌లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి..