ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
AP-Telangana: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది.