ఆంధ్రప్రదేశ్‌కు షాక్ ఇచ్చింది రైల్వేశాఖ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్త మెలిక పెట్టింది. సెంటిమెంట్‌ను గౌరవించి 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ కొనసాగిస్తూనే.. కీలక మార్గాలలో కోత పెట్టింది. కార్గో, అరకు పర్యాటక అభివృద్ధికి కీలకమైన కొత్త వలస - కిరండోల్ మార్గం ఒడిషా పరిధిలోకి వెళ్ళిపోనుంది.