MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు.…