భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే వారు హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శివాజీ విగ్రహం కూలిపోవడం మరాఠా దిగ్గజానికి అవమానకరమని అన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టి ( గురువారం) నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.
హర్యానాలో ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్ మధ్య పొత్తు బెడిసికొట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మేధావి, వ్యూహకర్త అని గాంధీ కుటుంబానికి దీర్ఘకాల సలహాదారుగా ఉన్న శామ్ పిట్రోడా అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కాబోయే ప్రధాని కావడానికి అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం సాధించేందుకు పార్టీల పోరు మొదలైంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
Vinesh Phogat Likely To Join Congress Ahead of Haryana Assembly Elections: భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియాలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్‌లు…
Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తన స్థానాన్ని బలంగా పరిగణిస్తోంది.. పదేళ్ల ప్రవాసాన్ని ముగించుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ సలహా మేరకు హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై చర్చలు జోరందుకున్నాయి.