అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతల తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
తిరుపతి లడ్డూ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల పవిత్రతను పరిరక్షించేలా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ సీనియర్ నేత రాసుకొచ్చారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తనను ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే…
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సమయంలో రిజర్వేషన్లు, సిక్కులపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బెంగళూర్‌లోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన తీవ్ర వివాదాలకు దారి తీసింది. అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. భారత్‌లో సిక్కులు భయంతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు కూడా మండిపడ్డారు.
JP Nadda: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య వివాదం ముదురుతుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాసిన లేఖలో మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదు అని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై…
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై ఈరోజు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అలాగే, ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ పంపారు.