Rahul Gandhi: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. డాలస్‌లోని ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో జరిగిన ఇంటర్వ్యూలో ఇండియా జోడో యాత్ర గురించి మాట్లాడారు.
DK Shivakumar: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కి డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అక్కడ కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు వినికిడి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పీఓకే ప్రజలు భారత్‌లో వచ్చి చేరాలని, వారిని విదేశీయుల్లా చూసే పాకిస్తాన్లా కాకుండా సొంతవారిలా ఆదరిస్తామని చెప్పారు.
Harish Rao: అక్కడ ఒక రూల్ ..తెలంగాణ లో మరో రూలా ? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ మీడియా సమావేశం ఆవేదన తో పెడుతున్నాను అన్నారు.
మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అవినీతి విషయంలో కళ్ళు తెరిచి చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్…
Vinesh Phogat To Joins Congress Today: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో ఓ మధుర జ్ఞాపకం అని, తాను మంచి సమయం గడిపానని చెప్పారు. దేశ సేవ కోసం తనకు ఇచ్చిన ఈ అవకాశంకు రైల్వేకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రైల్వే ఉన్నతాధికారులకు వినేశ్ తన రాజీనామా లేఖను…
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే వారు హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.