మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు.
TPCC Chief Post: ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Congress Key Meeting: తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ( శుక్రవారం ) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది.
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ వేడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం శ్రీనగర్ చేరుకున్నారు.
Jammu Kashmir Assembly Polls: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు.
Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.
Jagdeep Dhankhar: భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ‘‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి’’ ప్రయత్నిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని మోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానికి రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మణిపూర్ పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు.