ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర సాగనుంది. అయితే ఈ రోజు రాహుల్ యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో పూనమ్ భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 15 నిమిషాలు రాహుల్ గాంధీతో మాట్లాడానని, చేనేత కార్మికులు మహిళల సమస్యలపై చర్చించామన్నారు. రాహుల్ గాంధీ పప్పు కాదు సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారన్నారు. వినతి పత్రాలు ఇవ్వగానే చదివిన తర్వాతే మాట్లాడుతున్నారని, త్వరలోనే మా అమ్మ చెల్లిని కలవాలని రాహుల్ గాంధీ కోరారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీని తగ్గించాలని, రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన లేదని, సమస్యల మీద పోరాటం చేస్తున్నానన్నారు.
Also Read : NTR: కర్ణాటక రాజ్యోత్సవానికి అతిథిగా ఎన్టీఆర్!
పద్మశాలీలు ఆలోచించి ఓటెయ్యాలని, మునుగోడులో చేనేతల కోసం పనిచేయని వారికి ఓటేయకండన్నారు. అధికార పార్టీని చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేయండని, చేనేత సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరినట్లు ఆమె వెల్లడించారు. రాహుల్ గాంధీ పూనమ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని, గాంధీజీ ధరించిన వస్త్రాలు కూడా చేనేతవేనని, చేనేతల కోసం కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయాలన్నారు పూనమ్. మా అమ్మ కూడా చేనేత చీరని కడుతుందన్న రాహుల్ గాంధీ .. మీరు మా అమ్మ చెల్లిని ఒకసారి కచ్చితంగా కలవండన్నారు. సోనియాగాంధీతో కలిపించే బాధ్యతను పార్టీ నాయకులు అప్పగించారు రాహుల్.