Bharat Jodo Yatra: తెలంగాణలో రెండో రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. జోడో యాత్రలో భాగంగా.. రాహుల్ ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు. కాసేపు సరదాగా సాగింది. అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. టీ.కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్‌ఎస్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా భారత్ జూడో యాత్రలో వున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయాలని అమ్మకం కొనుగోలు చుట్టే తిరుగుతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనడం మొదలుపెట్టింది టీఆర్‌ఎస్ ఏ అంటూ ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కొనసాగిస్తుంది బీజేపీ అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ట్రాప్ చేసిందన్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Read also: Shivaji on Currency Note: కరెన్సీ నోటుపై శివాజీ?.. మహారాష్ట్ర నాయకుడి చమత్కారం
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే కొనుగోలు ఇష్యుపై మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రజాస్వామ్యమును అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కూడా గతంలో ఇలానే కొనిగోళ్లే చేసిందని అన్నారు. బీజేపీ కొనుగోలు చేయాలని చూసిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ వాల్లే అంటూ ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్ తోడు దొంగలు అంటూ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల ముందు డ్రామా అడుతున్నాయని ఫైర్ అయ్యారు. దోచుకున్న డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామం మీద నమ్మకం లేని వాళ్ళు టీఆర్‌ఎస్, బీజేపీ అని మధుయాష్కీ అన్నారు.