ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. నిన్నటితో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించి 50 రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే.. నేడు మూడో రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఎలిగండ్ల నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర.. మరికల్, పెద్ద చింతకుంట, లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా మన్యం కొండ వరకు సాగునుంది. మన్యం కొండ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు 23.3 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
Also Read : Minister Asks Collector: మద్యం తాగుతావా.. కలెక్టర్‌ను అడిగిన మంత్రి, మండిపడుతున్న విపక్షాలు
గోప్లాపూర్ శివారులో మధ్యాహ్నం భోజనం విరామం తరువాత తిరిగి మళ్లీ యాత్రలో పాల్గొంటారు. రాత్రికి ధర్మాపూర్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 1న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఏఐసీసీగా పదవి చేపట్టిన తరువాత మల్లికార్జున ఖర్గే తొలి పర్యటన కావడం విశేషం. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతుండగానే మల్లికార్జున ఖర్గే ఈ పాదయాత్రలో పాల్గొనాలనుకోవడం గమనార్హం.