తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ కు మద్దతుదారులైన సెలబ్రిటీలను ఇందులో భాగంగా చేస్తోంది. తద్వారా రాహుల్ పాదయాత్రకు మరింత ప్రజాదరణ తీసుకురావచ్చన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోతురాజు అవతారమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా భారత్ జోడో పాదయాత్రలో పోతురాజులు కలిసారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోణాలు, పోతురాజుల గురించి రాహుల్ గాంధీకి వివరించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీంతో.. రాహుల్ గాంధీ కొరడా అందుకొని పోతురాజుల విన్యాసాలు చేసి కొరడాతో రెండు సార్లు కొట్టుకున్నారు. దీంతో అక్కడి వాతావరణం రాహుల్ అంటూ ఓరెత్తించారు. అక్కడకు వచ్చిన పోతురాజులను హుత్సాహపరుస్తూ పోతురాజుల విన్యాసం చేశారు. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కొరడా తీసుకుని పోతురాజుల విన్యాసం చేశారు. తీన్మార్ స్టేప్పులు వేసి చిందేశారు. కాసేపు అక్కడ ప్రాంతమంతా పోతురాజులు విన్యాసాలు, తీన్మార్ స్టేప్పులు దద్దరిల్లింది.
Read also:Vishal v/s Prakash Raj: విశాల్ ట్వీట్‌కు వ్యంగ్యంగా బదులిచ్చిన ప్రకాశ్ రాజ్
ఇప్పటికే నటి పూనమ్ కౌర్, బాలీవుడ్ సీనియర్ నటి పూజా భట్ రాహుల్ తో కలసి తెలంగాణలో కొద్దిదూరం నడిచారు. ఇవాళ సంగారెడ్డి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. చేర్యాల దగ్గర చిన్నారులతో కలిసి రాహుల్ గాంధీ కరాటే చేశారు. ఈనేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. ఆయనకు 89 సంవత్సరాల వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి చేతిలో చేయివేసి రామదాసు సతీ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్ పాద యాత్రకు మద్దతు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. అక్టోబర్ 23వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా కృష్ణా మండలం గూడేబల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్‌గాంధీ నవంబర్ 2 నాటికి ఎనిమిది రోజుల్లో 170కి పైగా కిలోమీటర్లు నడిచారు. తొలి రోజు కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే నడిచిన ఆయన మిగిలిన ఏడు రోజుల్లోనే 166 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం గమనార్హం.