Rahul Gandhi: రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు (ఈ నెల 17న) రాష్ట్రానికి రానున్న ఆయన ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుఫాన్ పర్యటన చేయనున్నారు. రాహుల్ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అక్కడే ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్రగా పశ్చిమ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వీధి సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో సాయంత్రం 6:30 గంటలకు రాజేంద్రనగర్ చేరుకుంటారు. అక్కడ సమావేశానికి హాజరైన తర్వాత ఆయన ఢిల్లీ వెళతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు రోజుకు గరిష్టంగా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం గమనార్హం.
21వ తేదీ తర్వాత ప్రచారం…
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 21తో ముగియనుంది. దీని తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ఐదు రోజుల పాటు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు కూడా 21 తర్వాత తమ పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!