తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తారు. తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. మరొకరు పోలుదాసు పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. ప్రఖ్యాత నటి శాంతకుమారి భర్త పి.పుల్లయ్య. ఈ దంపతులు…