నియోజకవర్గ స్థాయి బూత్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓడిపోవుడు కొత్త కాదు.. ఆయన ఎదో బ్రహ్మ పదార్ధం కాదు.. తన నియోజకవర్గంకు కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదు అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ అనే పదాన్ని విసతృతంగా ప్రచారం చేసింది కడియం శ్రీహరినే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఘనపూర్ కు కడియం ఏమి చేశాడో చెప్పాలి అని డిమాండ్ చేశాడు.
Read Also: ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!
కడియం శ్రీహారి నియోజకవర్గానికి ఒక్క కంపెనీ రాలేదు అని రఘునందన్ రావు అన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల అఫిడవిట్ తీసుకోవాలి అయన ఆస్థి ఎంత పెరిగిందో తెలుస్తది అంటూ విమర్శలు గుప్పించారు. దళిత బిడ్డలకు రిజర్వేషన్ లు ఇవ్వలేదే.. ప్రైవేట్ యూనివర్సిటీలో దళితులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు.. బై ఎలక్షన్ లో రాజయ్యకు మద్దతుగా వచ్చి కడియంను ఓడగొట్టాం.. నిన్న అన్ని పైసలు ఖర్చు పెట్టి ఎదో భ్రమ కల్పించాడు అని ఆయన అన్నారు.
Read Also: Chandrayaan-3: దక్షిణ ధ్రువమే ఎందుకు?.. చంద్రయాన్-3 లక్ష్యాలను వెల్లడించిన ఇస్రో చీఫ్
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్సీ కడియం శ్రీహారిని ఓడగొడతారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఎంత అహంకారమో ఈయనకు కూడా అంతే అహంకారం అంటూ ఆయన విమర్శించారు. జర్నలిస్ట్ మిత్రులకు డబుల్ బెడ్ రూములు ఇస్తానని ఇచ్చాడా.. పొరపాటున ఇంకోసారి అవకాశం ఇస్తే గోసి మిగులుస్తారు.. దళిత బంధు, బీసీ బంధుల గురించి నిలాదీయాలి.. దేవాదుల నుంచి నీళ్లు తెచ్చినా అంటాడు కడియం శ్రీహారి.. ఘనపూర్ లో కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పాలి అని రఘునందన్ పిలుపునిచ్చారు.