Raghunandan Rao: రేవంత్ రెడ్డి ఢిల్లీ కేసులు మాట్లాడుతున్నారు మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, అధ్యక్షులు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ మీద బట్ట కాల్చి మీదేసి హెడ్లైన్స్ లో మొదటి పేజీ వార్తల కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టీ, లిక్కర్ కేసులో ప్రెస్ మీట్ పెట్టీ దాని మూలాలు ఆంధ్ర, తెలంగాణకు ఉన్నాయని చెప్పారు. అప్పుడు Ed, cbi మీ జేబు సంస్థనా అని అన్నారు. Cwc సమావేశం నుంచి కొత్త కొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయితది అని రేవంత్ అంటున్నారు.. అంటే ED lu, సీబీఐ లు మీ జేబు సంస్థలా? మీకు సమాచారం ఎట్లా వచ్చింది? అని ప్రశ్నించారు. అప్రూవర్ గా మారిన దాంట్లో మీ చట్టాలు ఉన్నారు కదా ఆయన చెప్పాడా? వాళ్ళు మీకు చెప్పారా? అన్నారు. కవితతో మీ వ్యాపార సంబంధం తెంచుకోమని చెప్పాడా? అన్నారు.
అప్రూవర్ గా మారిన వాళ్ళు మీకు చెప్పారా ? లేక ed , CBI వాళ్ళు చెప్పారా? అని అడిగారు. రేవంత్ రెడ్డి నీ సూటిగా అడుగుతున్న మీకు సమాచారం ఎట్లా వచ్చింది? అని అడిగారు. ఢిల్లీ కేసులు మాట్లాడుతున్నారు మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరు? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఎందుకు ట్రయల్ నడుపుతలేరు? ప్రపంచం అంతా చూసిన పట్ట పగలు దొరికిన దొంగ రేవంత్ అని స్వయంగా సీఎం కెసిఆర్ చెప్పాడు మరి ఛార్జ్ షీట్ వేసిన కేసులో దేనికీ సాక్షుల విచారణ సాగుత లేదన్నారు. నేను కొట్టినట్టు చేస్తా మీరు ఏడ్చినట్టు చెయ్యండి అని కాంగ్రెస్, brs డ్రామాలు చేస్తున్నారా? అని మండిపడ్డారు. వారం నుంచి కాంగ్రెస్, brs డ్రామాలు బాగా నడుస్తున్నాయన్నారు. గతంలో మీరు కనిమొళి, రాజా మీద కేసు లు ed, CBI లు కేసు పెట్టాయి కదా అది మీ కాంగ్రెస్ సర్కారు చేయించిందా? అని ప్రశ్నించారు. కెసీఆర్ గారు మీ సర్కారే ఉంది.. రేవంత్ దొరికిన దొంగ అని ఎందుకు వెనక్కి తగ్గారు? అన్నారు. కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. 2023 కేసు గురుంచి మాట్లాడుతున్న మీరు 2016 కేసు ఎందుకు మాట్లాడుతలేరు? మీడియా, అధికారులు కూడా స్పందించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ రాడు కాబట్టి ఎన్నికల తర్వాత కాంగ్రెస్, brs కలిసిపోవడం కోసమే కదా అని రఘునందన్ రావు అన్నారు.
Mynampally: రెండు టికెట్లు ఇస్తా అన్నారు.. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతా..