తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ సైతం 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే.. ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్‌లో నేడు దుబ్బాక్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న తర్వాత పరిస్థితి మారిపోయింది.. బండి సంజయ్‌ను తప్పించలేదు, ఆయన పదవీకాలం ముగిసింది.. పార్లమెంటరీ పార్టీ నిర్ణయం మేరకే మార్పు.. దుబ్బాక ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఇవ్వలేదు.. గజ్వేల్‌కు రైలు మేమే ఇచ్చాం.. దుబ్బాక మీదుగా రైలు వెళ్తోంది.. నా వల్లే దుబ్బాకలో గెలిచానన్న ఆడియో, వీడియోలతో నాకు సంబంధం లేదు..
వ్యక్తిగతంగా నేను ఎవరితో గొడవ పడలేదు. దుబ్బాక ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలిచాను. హెల్త్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టే హరీష్ రావు నా కూతిరి ఆస్పత్రి ఓపెనింగ్‌కు వచ్చారు. కేసులను వాదించడానికి పార్టీలతో సంబంధం లేదు. 2014-23 మధ్య నాపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఓఆర్‌ఆర్ టెండర్ల విషయంలో వెనక్కి పోలేదు. బీజేపీలో కోవర్టులు ఉంటే విజయశాంతి పేర్లను ఎందుకు అమిత్‌షాకు చెప్పలేదు. కాంగ్రెస్‌కు చెప్పుకోవడానికి ఏమీలేదు. అందుకే బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేస్తోంది. మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్ గతంలో పనిచేసింది నిజంకాదా.? 2014లో కాంగ్రెస్‌లో గెలిచినవారు ఎక్కడికి వెళ్లారు.? రేపు గెలిస్తే కాంగ్రెస్‌లో ఉంటారనే నమ్మకం ఉందా.? కొత్త ప్రభాకర్‌రెడ్డి దాడి బాధకరం. కాంగ్రెస్ కార్యకర్తే దాడి చేశారని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. సంచలనం కోసమే నిందితుడు దాడి చేశారని సీపీ చెప్పారు. ‘ అని రఘునందర్ రావు తెలిపారు.