Raghurama Krishna Raju: అమరావతి ప్రాంత మహిళలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Read Also: Janmabhoomi Express : తెలంగాణలో తప్పిన పెను ప్రమాదం.. జన్మభూమి…
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. "పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది..
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ సభ్యులు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ రఘురామ.. స్పీకర్‌ను కోరారు.. ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పవని..…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసుపై ఆయనను ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా, తనను కొట్టారంటూ ఆయన ఆరోపించడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు…
రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్పొన్నవోలు సుధాకర్ అన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసింది మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారు. అప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామ కృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీశారు అని పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు అని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. రఘరామ కృష్ణరాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసింది. రేపు మధ్యాహ్నంలోగా…