Congress: జూన్ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా ముక్కలవుతుందని మాజీ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని పర్యాయాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. నామినేషన్ తర్వాత ఆయన భావోద్వేగంతో ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి.
Kishori Lal Sharma: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీకి అభ్యర్థుల్ని ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు.
ప్రియాంకాగాంధీ.. పరిచయం లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
కాంగ్రెస్ అధిష్టానం ఊరించి.. ఊరించి ఎట్టకేలకు శుక్రవారం ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది.
గత కొద్ది రోజులుగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. కొద్దిసేపటి క్రితమే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.