కాంగ్రెస్ అధిష్టానం ఊరించి.. ఊరించి ఎట్టకేలకు శుక్రవారం ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారని వార్తలు షికార్లు చేశాయి. కానీ ఊహించని విధంగా ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన రాజకీయకంగా ఆశ్చర్యానికి గురి చేసింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కేఎల్.శర్మను కాంగ్రెస్ హైకమాండ్ బరిలోకి దించింది.
ఇది కూడా చదవండి: Harish Rao: కాంగ్రెస్ వచ్చాక బంగారం, నిత్యవసర ధరలు పెరిగాయి..
రాయ్‌బరేలీ, అమేథీ సీట్ల ప్రకటన తర్వాత ప్రియాంకాగాంధీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమేథీలో కిషోరిలాల్ శర్మను అభ్యర్థిగా నిలబెట్టడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. కిషోరి లాల్ శర్మతో తమ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తుచేశారు. అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటారని తెలిపారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న మక్కువ ఉందని చెప్పడానికి శర్మనే ఉదాహరణ అని ప్రియాంక చెప్పారు.
ఇది కూడా చదవండి: Noida : డాగ్ లవర్స్ తాట తీసిన.. నోయిడా జనాలు.. స్టేషన్లో రచ్చ రచ్చ
రాయ్‌బరేలీ, అమేథీలో మే 20న పోలింగ్ జరగనుంది. అయితే శుక్రవారమే నామినేషన్‌కు గడువు ముగియనుంది. మరికాసేపట్లో రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్ వెంట సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఉండనున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
