బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రభాస్ తో “రాధేశ్యామ్” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీతో అలరించడానికి సిద్దం అయిపోయింది. మరోవైపు విజయ్ తో “బీస్ట్”లో జతకడుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా కనిపించబోతోంది. “ఆచార్య”నూ వదిలిపెట్టకుండా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇక…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్ర నిర్మాతలు బుధవారం మరోసారి స్పష్టం చేశారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాను ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ తో కలసి, గోపీకృష్ణా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకర్ స్వరాలు సమకూర్చుతున్న ‘రాధేశ్యామ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 12న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’,…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా…
‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అంతే కాదు తను చేసే ప్రతి సినిమాలో కొత్త కొత్త విషయాలను చూపిస్తూ ఇండియన్ సినిమాలో ఇంతకుముందు ఉపయోగించని కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్యమైన ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, జమ్మలమడుగులోని గండికోటలో ఉన్న 15వ శతాబ్దపు దేవాలయంలో కంప్లీట్ చేశారు. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. “రాధే శ్యామ్” రొమాంటిక్ ఎంటర్టైనర్ పీరియడ్ డ్రామా కాబట్టి ఈ మందిరాన్ని షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగిస్తే సన్నివేశాలకు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది.…
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న “రాధేశ్యామ్” షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాడు. ప్రభాస్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ లవ్ డ్రామా విడుదల తేదీని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని బృందం “రాధే శ్యామ్” ఇచ్చిన ప్రకటన ధృవీకరిస్తుంది.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ మూవీలో వీరిద్దరూ మొదటిసారి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. సినిమా రిలీజ్ డేట్ పై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్, టి-సిరీస్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జూన్ లో షూటింగ్ లో పాల్గొన్నారు.…