యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న “రాధేశ్యామ్” షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాడు. ప్రభాస్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ లవ్ డ్రామా విడుదల తేదీని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని బృందం “రాధే శ్యామ్” ఇచ్చిన ప్రకటన ధృవీకరిస్తుంది. రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Read Also : మనసున్న మనిషి… సోనూ సూద్!
ఈ పోస్టర్ లో క్లాస్సీ సూట్ ధరించిన ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో “రాధే శ్యామ్” రూపొందుతోంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ టి-సిరీస్‌తో కలిసి నిర్మిస్తోంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించిన నేపథ్యంలో మేకర్స్ పై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. “సాహో”లో అంటే యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి రెండేళ్లు పట్టింది. “రాధేశ్యామ్” లవ్ డ్రామానే కదా… దీనికి రెండేళ్లు పట్టడం ఏంటి? లాజిక్ మిస్సవుతోందే ! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2022లో ప్రభాస్ నటించిన మరో రెండు చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఒకటి ‘రాధేశ్యామ్’ కాగా, మిగిలిన రెండు “సలార్”తో ఏప్రిల్ లో, “ఆదిపురుష్”తో ఆగస్టులో పలకరించనున్నాడు.