యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది. రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవలే సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు.
Read Also : వెబ్ సిరీస్ తో నవ్వించబోతున్న రకుల్!
తాజా సమాచారం ప్రకారం “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ అహోబిలంలో 3 రోజులు షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు అంటున్నారు. అది కూడా పరమహంస అనే సాధువు పాత్రలోనట. అహోబిలంలోని టెంపుల్ లో విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు, పరమహంస పాత్రలో కన్పించనున్న కృష్ణంరాజుకు మధ్య కీలకమైన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.