పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన బజ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ‘రాధే శ్యామ్’ ప్రత్యేక షోను వీక్షించి, పలు మార్పులను సూచించాడట. అయితే ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయినప్పటికీ మేకర్స్ రాజమౌళి ఇచ్చిన విలువైన…
చాలా రోజులుగా డస్కీ సైరన్ పూజా హెగ్డే, ప్రభాస్ కు మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు ప్రమోషన్లలో ప్రభాస్, పూజా కలిసి కనిపించకపోవడం ఈ రూమర్స్ కు బలాన్ని చేకూర్చింది. అయితే మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉన్న “రాధేశ్యామ్” ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. Read Also : RRR : తారక్ అభిమాని అరాచకం… ఏం చేశాడంటే? అయితే ఇటీవల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో…