చీరకట్టులో నుదుటి బొట్టుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటూ కనికట్టు చేసింది కొత్త పెళ్ళికూతురు నయనతార. కోరుకున్నవాడితో కొంగు ముడేసుకోగానే కళ్యాణచక్రవర్తి శ్రీనివాసుని దర్శనం చేసుకుంది. అసలే తిరుమల, ఆ పై భక్త జనసందోహం! వచ్చిందేమో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్! ఇక జనం నయన్ ను చూడటానికి ఎగబడకుండా ఉంటారా? చిత్రంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ‘ఫోటో షూట్’ కూడా సాగించింది నయన్. ఇదే పొరపాటు అనుకుంటే ఈ నవ వధువు కాళ్ళకు చెప్పులు వేసుకొని…
సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, దాతో రాధా రవి కీలకపాత్రల్లో కిషోర్ ఎన్ రూపొందిస్తున్న చిత్రం “మాయోన్”. నిధి కోసం వెళ్ళే యువకుల టీంకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు, ధైర్య సాహసాలతో కూడిన అడ్వెంచరస్ మూవీ ఇది. దేవాలయాల రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మిస్టరీ థిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసక్తికర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ…