ఈమధ్యకాలంలో కోర్టుల్లోనూ, కోర్టుల బయట తుపాకులు, కత్తులతో కొందరు తిరుగుతున్నారు. తాజాగా రంగారెడ్డి కోర్టుల దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు లోకి కత్తితో ప్రవేశించాలని చూసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కిరణ్ అతని మిత్రుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకి అప్పగించారు కోర్టు సెక్యూరిటీ సిబ్బంది. గత సంవత్సరం మియాపూర్ కి చెందిన ఒక యువతి తన క్లాస్ మేట్ మైనారిటీ యువకుడు…
వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్‌కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం…
హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని…
తాళం వేసి వున్న ఇల్లే అతని టార్గెట్. చిటికెలో పనిముగించుకుని మాయం అవుతుంటాడు. ఒకటి కాదు రెండు 16 ఏళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి పాపం పండింది. పోలీసులకు చిక్కాడు. కరడు గట్టిన గజదొంగను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేశారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు రాసికుల్ ఖాన్. రాచకొండ లో 17 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు ఈ నిందితుడు రాసికుల్ ఖాన్. పలు రాష్ట్రాల్లో 100…
హైదరాబాదులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. రాచకొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా మరొకసారి కనబడింది. కుషాయిగూడ పరిధిలో చెడ్డి గ్యాంగ్ రెక్కీ చేసినట్లు తెలుస్తుంది. పలు కాలనీలలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ కదలికల పై జంటనగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాయి పోలీసులు. నగరంలో మరొకసారి పాగా వేసిన చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి…
రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు ఛోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంటో దొంగతనం చేసిన ఆరుగురు దొంగలను అదుపులోకి తీసకొని విచారించగా విషయం బయటపడింది. ఈ…