తాళం వేసి వున్న ఇల్లే అతని టార్గెట్. చిటికెలో పనిముగించుకుని మాయం అవుతుంటాడు. ఒకటి కాదు రెండు 16 ఏళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి పాపం పండింది. పోలీసులకు చిక్కాడు. కరడు గట్టిన గజదొంగను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేశారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు రాసికుల్ ఖాన్.
రాచకొండ లో 17 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు ఈ నిందితుడు రాసికుల్ ఖాన్. పలు రాష్ట్రాల్లో 100 కేసులు పైగానే ఇతనిపై నమోదయ్యాయి. 3.5 కిలోల బంగారం సహా పలు కేసులలో నిందితుడు. అతని కోసం 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్ చేశారు పోలీసులు. 52 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తాళం ఉన్న ఇండ్లను రెక్కీ చేసి దోచుకుంటున్నాడు రాసికుల్ ఖాన్. సైకిల్ పై తిరుగుతూ ఇళ్ళని పరిశీలిస్తాడు. అదన చూసి మాటు వేసి మరీ ఇళ్ళు లూటీ చేయడం ఇతని స్టయిల్. పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన ఈ గజదొంగ కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.