Manchu Manoj: కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశ పడలేదు.. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మనోజ్
- మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్
- తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారన్న మనోజ్
- కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరిన మనోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ను మోహన్ బాబు కోరారు. తాజాగా మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు.
Read Also: Mohan Babu : మనోజ్, మౌనిక వల్ల ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి!
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబానికి దూరంగానే ఉంటున్నామని మనోజ్ తెలిపారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారన్నారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ కెమెరాలు మాయమైపోయాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్‌కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని అన్నారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ్ రెడ్డి ,కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదని.. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు.
నేను, నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మంచు మనోజ్ తెలిపారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని.. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ వెల్లడించారు.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024
తాజావార్తలు
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!