LB nagar flyover: ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం.. మాటల్లో పెట్టి కాపాడిన కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LB nagar flyover: ఎల్‌బి నగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని మాటలో పెట్టి చాకచక్యంగా కానిస్టేబుల్ టి.సతీష్ కాపాడాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపించారు.
ఎల్‌బి నగర్ ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి అంచున నిలబడి దూకేస్తానంటూ బెదిరించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు అక్కడే వున్న కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు. దీంతో కానిస్టేబుల్ టి.సతీష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దూకుతున్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ వ్యక్తి దూకేస్తానని దగ్గరకు రావద్దని తెలుపడందో కానిస్టేబుల్ కంగారు పడ్డాడు. తరువాత తన వద్ద వున్న వాకీటాకీ మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తూ ఆ వ్యక్తి దగ్గరకు వెల్లడం స్టార్ట్ చేశాడు. ఒక తన దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. అతనితో మాట్లాడుతూనే పక్కకు లాగేశాడు. దీంతో ప్రమాదం తప్పింది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
Read also: Theft: పెండ్లి ఇంట్లో భారీ చోరీ.. 11 లక్షలతో ఉడాయించిన దొంగలు
ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ టి.సతీష్ మాట్లాడుతూ.. బస్టాప్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి డ్యూటీ చేస్తున్నాను. దాదాపు సాయంత్రం 5 గంటల సమయంలో ఫ్లైఓవర్ గుండా వెళుతున్న ప్రయాణికులు, అంచున కూర్చున్న బాధలో ఉన్న వ్యక్తి గురించి వచ్చి చెప్పారు. ఆందోళన చెందిన సతీష్ వెంటనే అతని వైపుకు పరిగెత్తాడు. ఫ్లైఓవర్‌పై కారు నడుపుతున్న ఓ బాటసారుడు యూ-టర్న్ తీసుకుని సతీష్‌ను సమయానికి అక్కడికి చేరుకోవడానికి సహకరించాడని తెలిపాడు. ఐడి కార్డ్‌లో అతని పేరు స్పష్టంగా లేదని, అతని వయస్సు 37 సంవత్సరాలు ఉంటుందని, అతని పేరు మంగ్రా గా గుర్తించారు. తన సోదరి జార్ఖండ్‌లో ఉందనే విషయాన్ని బయటపెట్టాడని అన్నారు. భావిస్తున్నారు. మేము ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాము కాబట్టి, అతన్ని ఎల్‌బి నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించామని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. జగన్నాధ్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆ వ్యక్తి సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న వలస కూలీగా పనిచేస్తున్నాడని అన్నారు. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు మరియు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్, D.S. చౌహాన్, కానిస్టేబుల్ ధైర్యసాహసాలను అభినందించారు. ఆ మనిషిని ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్ కు స్థానికులు సలామ్ పోలీస్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
GVL Narasimharao: టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ క్లారిటీ!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు