హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు.