రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్…
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. మాధవ్‌ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్, కర్నాటక ఎంపీ పీసీ మోహన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా మాధవ్‌కు ధృవీకరణ పత్రంను ఎంపీ పాకా సత్యనారాయణ, పీసీ మోహన్ అందజేశారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడు మాధవ్‌కు పార్టీ నేతలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం…
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ఈరోజు అధిష్టానం ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరు నిన్ననే ఖరారు కాగా.. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈరోజు ఉదయం 10:45కు అధ్యక్షుని పేరును ప్రకటిస్తారు. అనంతరం పదవీ ప్రమాణం, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష…
నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు…
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష పదవికి సింగిల్ నామినేషన్ వేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మాధవ్ ఎన్నిక లాంఛనమే అంటున్నాయి పార్టీ వర్గాలు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో ఐదు దశాబ్దాల పైగా మాధవ్ కుటుంబానికి అనుబంధం ఉంది. మాధవ్ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీ అధ్యక్షులు అయిన అరుదైన రాజకీయ నేపథ్యం చోటుచేసుకోనున్నది. Also Read:Real Estate Fall In Hyderabad…
Janasena and BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు ఉందని పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు.. అవసరం అయితే.. బీజేపీకి బైబై చెప్పేందుకు కూడా సిద్ధమేనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించి పొత్తుల వ్యవహారంలో కాకరేపారు.. కానీ, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ రెండు పార్టీల పొత్తుపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. టీడీపీని కూడా కలుపుకుపోవాలని కొందరు అంటుంటే.. అసలు…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగు దేశం కూడా భారతీయ జనతా పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణం అన్నారు.. ఇప్పటికీ బిల్లులు మ్యానువల్ గా జరగడం వెనుక ఉద్దేశ్యాలను ప్రశ్నిస్తున్నాం.. ఆర్ & ఆర్ నిర్ధారణ, నిర్వాసితుల గుర్తింపు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు.. కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని…