Russia-India: రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఇంతలో ఆ దేశం భారత్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా భారత్‌తో కీలకమైన సైనిక ఒప్పందమైన రెసిప్రొకల్ ఆపరేషన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ (RELOS)ను అధికారికంగా ఆమోదించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు ఈ చర్య తీసుకున్నారు. ఈ అంశంపై డూమా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ.. భారతదేశంతో రష్యా సంబంధాలు వ్యూహాత్మకం, సమగ్రమైనవని…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడేళ్ల తర్వాత భారత్ లో పర్యటించనున్నారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 2021లో భారత్ ను సందర్శించారు. ఈసారి, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 4-5 తేదీలలో జరుగనున్నది. ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రపంచం చూసేందుకు రెడీ అయ్యింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా, భారతదేశం రష్యాకు మద్దతు ఇవ్వడంలో స్థిరంగా ఉంది. ఈ పర్యటనలో పాకిస్తాన్, చైనాకు వణుకు పుట్టేలా కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.…
Putin to Visit India: అమెరికాతో ఉద్రిక్తత మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటన సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనపై భారత్ ఎంతో ఉత్సాహం, ఆనందంగా ఉందని అజిత్ పేర్కొన్నారు. గత భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలను ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు క్షణాలుగా ఆయన అభివర్ణించారు.