పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read…
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప : ది రైజ్” ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. గత వారం ఈ మూవీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశీ’ని సైతం అధిగమించి భారతదేశంలో 2021లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై…
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప రికార్డులే మారుమ్రోగిపోతున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకోంది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల తో బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ‘కెజిఎఫ్’ ఆల్ టైమ్…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంటుంది. ఎక్కడా తగ్గేదేలే అనుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సక్సెస్ ని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకొంటుంది. అన్ని జిల్లాలో పుష్ప సక్సెస్ పార్టీని విజయవంతముగా నిర్వహించిన మేకర్స్ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో తమ విజయాన్ని పంచుకున్నారు. ‘పుష్ప’ డైరెక్టర్స్ పార్టీ పేరుతో అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టాలీవుడ్ దర్శకులందరు…
నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను ఆతృతగా ఎదురు చూసేలా చేస్తోంది బాలయ్య హోస్టింగ్ నైపుణ్యం. ఈ ప్రముఖ టాక్ షో తాజా ఎపిసోడ్ లో బాలయ్యతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 25న అంటే రేపు ప్రసారం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ…
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఓవర్ ఆల్ గా హిట్ టాక్ ని తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల కలెక్షన్లను రాబట్టి సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాపై సెలబ్రెటీలు తమదైన రీతిలో స్పందిస్తూ పుష్ప టీమ్ కి అబినందనలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా పుష్ప టీం కి శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ట్విట్టర్ వేదికగా “కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్.. ఇండియా మొత్తంగా ‘పుష్ప’కు వస్తున్న…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్ట్, దర్శకుడు సుకుమార్ ఎంత వరకు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు అని ఆరా తీస్తున్నారు సినీ ప్రేక్షకులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న…
‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమా చూసిన చాలా మంది చెప్తున్న విషయం ఏమిటంటే సెకండాఫ్ ల్యాగ్ అయ్యిందని, అంతేకాకుండా 3 గంటల సుదీర్ఘ రన్ టైమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని అంటున్నారు. అయితే చాలా పెద్ద చిత్రాలకు సాధారణంగా అలాంటి రన్‌టైమ్ ఉంటుంది. అయితే ప్రేక్షకులు చేస్తున్న ఈ కంప్లైంట్ పై నిర్మాతలు ఏమంటున్నారంటే… Read also : అనారోగ్యంతో ఉన్న…