ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్ట్, దర్శకుడు సుకుమార్ ఎంత వరకు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు అని ఆరా తీస్తున్నారు సినీ ప్రేక్షకులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం… ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. ముందుగా ఆయన లాభాలలో వాటా తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ తరువాత ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ ఈ సినిమా కోసం దాదాపు 50 కోట్ల పారితోషికం తీసుకున్నారట. కథానాయికగా నటించిన రష్మిక మందన్న ఈ చిత్రానికి 8 నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ‘పుష్ప’లో విలన్‌గా నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ సినిమా కోసం రూ.3. 5 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు.
Read Also : ఇది కదా మనకి కావాల్సిన మాస్… బాలయ్యతో రవితేజ !
సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం రూ.3. 5 కోట్లు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 25 కోట్లు, స్పెషల్ సాంగ్ లో కన్పించిన సమంత రూత్ ప్రభు ఏకంగా 1. 5 కోట్లు పారితోషికంగా అందుకున్నారని సమాచారం. ఇక చిన్న పాత్రలో నెగెటివ్ షేడ్ లో మెరిసిన అనసూయ భరద్వాజ్ ఒక రోజు షూట్‌కి 1. 5 నుండి 2 లక్షల వరకు వసూలు చేసిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.