పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. 27 మంది గాయపడ్డారు. లంబి నియోజకవర్గానికి సమీపంలోని సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని బతిండా ఎయిమ్స్‌కు తరలించారు. ఈ పేలుడులో, ఫ్యాక్టరీ భవనంలోని రెండు అంతస్తులు క్షణాల్లో పేక ముక్కలా కుప్పకూలాయి. కర్మాగారంలో బాణసంచా తయారీ పని ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ నివాసి అయిన కాంట్రాక్టర్…