పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగూల్మంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూర్ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. సీఎం జగన్ తన సుదీర్గ పాదయాత్రలో ఎక్కడా కత్తులు, కటార్లతో అల్లర్లకు పాల్పడ లేదు అని ఆయన కామెంట్స్ చేశారు.