ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ అద్భుత ఆటకు తెరపడింది. బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో పోరాడి ఓడింది. పుణెరి పల్టాన్ చేతిలో 50-45తో టైటాన్స్ ఓడిపోయింది. ఈ ఓటమితో టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. విజయం సాధించిన పల్టాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక టైటిల్ పోరు కోసం శుక్రవారం దబంగ్ ఢిల్లీని పల్టాన్ ఢీకొంటుంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పేలవ…
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గత కొన్నేళ్ల పేలవ ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్.. 12వ సీజన్‌లో నిలకడగా రాణిస్తోంది. వరుస విజయాలతో విజృంభిస్తున్న టైటాన్స్ ఈ సీజన్‌లో ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై 46–39తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫయర్-2కు మన తెలుగు టీమ్ అర్హత సాధించింది. ఈరోజు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. శుక్రవారం…
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.