కడప జిల్లాలోని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టులు మీద ట్విస్టులు వచ్చి చేరుతున్నాయి... పోలింగ్ అడుగు దగ్గర పడుతూ ఉండటంతో అన్ని పార్టీలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై దృష్టి సారించాయి.. దీంతో ఆ పార్టీలకు నిప్పులాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.. దీంతో దాదాపు నాలుగు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఇక్కడ నెలకొంది.. ఈ అంశంపై వైఎస్ఆర్…
Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.
పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్‌లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు..
AP Byelections 2025 Notification Released: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల నిర్వహణకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయితీలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగష్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆగస్టు 10న, ఆగస్టు 12న పోలింగ్…
కడప జిల్లాలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు..
పులివెందుల....పొలిటికల్‌గా ఈ పేరు చెప్పగానే.... ఏపీలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబమే. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటలా మలుచుకుంది ఆ ఫ్యామిలీ. అలాంటిచోట పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీడీపీ. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో... వైనాట్ పులివెందుల నినాదం ఇచ్చింది. మరి అలాంటి చోట ఆ పార్టీ తీరు ఎలా ఉండాలి? ప్లానింగ్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉండాలి?
YS Jagan: కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. రేపు (జూలై 8న) దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు.