నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు. 24 షెడ్యూల్: వైఎస్ జగన్ మంగళవారం ఉదయం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నుంచి నాలుగు రోజుల పాటు (డిసెంబర్ 27) సొంత నియోజవర్గంలో జగన్ పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని.. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతారు. 24…
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద టీడీపీ తరపున పోరాడారాయన. ఒక రకంగా చెప్పాలంటే… నియోజకవర్గంలో పార్టీకి కేరాఫ్. కానీ… ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకున్నారు. తీరా తాను మారిన పార్టీ ఓడిపోయి… పాత పార్టీ పవర్‌లోకి వచ్చేసరికి దాదాపు మైండ్ బ్లాక్ అయిందట. ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారిన ఆ నేత ఎవరు? ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో పులివెందుల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పొలిటికల్‌గా…
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ( ఆదివారం ) పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివేందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. రేపు(జూన్ 22న) పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దైంది. ఈనెల 21, 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన.